Pendekallu Encroachments Demolition: కర్నూలు జిల్లా పెండేకల్లులో వివాదంగా ఆక్రమణల తొలగింపు

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పెండెకల్లు ఆర్ఎస్ గ్రామంలో పాఠశాల ఆట స్థలంలో ఉన్న ఇళ్లను కూల్చేయటం వివాదంగా మారింది. ముఫై ఏళ్ల నుంచి ఇరవై కుటుంబాలు ఇక్కడే ఉంటున్నా ఇప్పుడు అకస్మాత్తుగా అధికారులు ఇళ్లను పడగొట్టమేమిటని నిర్వాసితులు ప్రశ్నించారు. తమకు వేరేచోట నివాసాలు ఏర్పాటు చేసుకునే వరకు కూడా అవకాశం ఇవ్వకుండా తమ ఇళ్లను పోలీసు బలగాలతో వచ్చి జేసీబీలతో పడగొట్టడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్రాంతి పండగ సమయంలో తమ కుటుంబాలను రోడ్డున పడవేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola