Alishetty Prabhakar : 39 ఏళ్లకే కలం బలం చూపిన అలిశెట్టి జయంతి, వర్ధంతి నేడు
ఆధునిక తెలుగు కవుల్లో చాలా మంది కలవరించే పేరు అలిశెట్టి ప్రభాకర్. 39 ఏళ్ల వయసులోనే అనేక కవితలు రాసి అనారోగ్య కారణాలతో పుట్టినరోజు నాడే మరణించిన ప్రభాకర్ కవితలు ఇప్పటికీ అనేక సందర్భాల్లో విస్తృతంగా వాడుతాం. తర్వాత తనదైన శైలిలో కలం బలాన్ని చూపించారు అలిశెట్టి ప్రభాకర్. వేశ్యగా మారిన మహిళల చీకటి జీవితాల గురించి... ఆధునిక కాలంలో జరిగే దోపిడీ గురించి ... ఇలా అలిశెట్టి రాసిన కవితలు అనేకమందిని విప్లవ భావాల వైపు వెళ్లేలా చేసాయి.