NV Prasad Counter : Nallapareddy ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడిన నిర్మాత
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి(MLA Nallapureddy Prasanna Kumar Reddy)పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్(Producer NV Prasad). నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ వ్యాఖ్యలు బాధాకరమని, కోవూరులో ప్రసన్న కూమార్ రెడ్డి కుటుంబం అంటే చాలా గౌరవం ఉందన్నారు.. అనవసరపు వ్యాఖ్యలతో గౌరవాన్ని దిగజార్చు కోవద్దన్నారు. వంద అడుగులపై నుంచి రోప్ కట్టుకొని కిందకు దూకితే ఎవరు బలిసి కొట్టుకుంటున్నారో తెలుస్తుందన్నారు. మీడియా ముందు మాట్లాడితే హీరో అయిపోరని, బలిసి కొట్టుకుంటోంది మీరేనంటూ మండిపడ్డారు.. ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, సినిమా వాళ్ళని అమర్యాదగా మాట్లాడటం మంచిది కాదన్నారు.. సినిమా నిర్మాణం ఎంత కష్టమో వచ్చి ప్రత్యక్షంగా చూడాలని, తన సినిమా నిర్మాణం సమయంలో ప్రసన్నకుమార్ ను ఆహ్వానిస్తానని ఎన్వీ ప్రసాద్ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు.