PCC Thulasireddy: మాట తప్పడం, మడమ తిప్పడం సీఎం జగన్ కి అలవాటైపోయింది
మాట తప్పడం, మడమ తిప్పడం సీఎం జగన్ కి అలవాటైపోయిందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. కడపజిల్లా వేంపల్లిలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన....మూడు దఫాల్లో మద్యపాన నిషేధం పెడతానన్నవారు ఎందుకు చేయలేదని తులసిరెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం అదికారంలోకి వచ్చాక 75శాతం మద్యం రేట్లు పెరిగియాన్నారు. ప్రభుత్వం కచ్చితంగా ఆదాయం కోసమే తిరిగి మద్యం రేట్లు తగ్గించిందన్న తులసిరెడ్డి....ఖజానా నింపుతున్న ఈ పథకానికి ప్రభుత్వం తాగండి...ఊగండి అని పేరు పెడితే బాగుంటుందంటూ తులసిరెడ్డి ఎద్దేవా చేశారు.