PCC Thulasi Reddy: తాడిచెట్టుకు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డి కోసం లా జగన్ వైఖరి ఉందన్న తులసిరెడ్డి
సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి వైఖరి ముక్కుసూటిగా లేదని కాంగ్రెస్ పీసీసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. సినిమా ధరలు తగ్గించింది... సినిమా రంగాన్ని దెబ్బతీయడంకోసం కాదని... ప్రత్యేకించి కొందరు హీరోల ఆర్థిక మూలాలు దెబ్బతీయడం కోసమని తులసిరెడ్డి తెలిపారు. సాకు మాత్రం పేదవాడికి అందుబాటు రేట్లలో వినోదం అందించడానికని చెప్పారని విమర్శించారు. కరెంటు, పెట్రోలు, మద్యం, ఇసుక, సిమెంటు ధరలు తగ్గించాలని, ఓటీఎస్, చెత్త, నీటి,ఆస్థి పన్నుల పెంపు జీవోలను రద్దు చేయాలని నిరసనలు, ధర్నాలు చేస్తున్నాపట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.