Payyavula Keshav: పీఏసీ సమావేశానికి హాజరవని అధికారులు... అసలేం జరిగింది?
అమరావతిలోని సచివాలయంలో పీఏసీ సమావేశం జరిగింది. ఈ భేటీకి అధికారులు హాజరవకపోవడంపై పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అభ్యంతరం తెలిపారు. సంబంధిత అధికారులకు కొవిడ్ సోకితే మిగతావారు కూడా రారా అని నిలదీశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేశవ్.... రాష్ట్రంలో సినిమాల కన్నా ముఖ్యమైన సమస్యలు చాలా ఉన్నాయని మంత్రులకు హితవు పలికారు.