Pasuvula Panduga: చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం కూనేపల్లిలో పశువుల పండుగ
సంక్రాంతి రాక ముందే చిత్తూరు జిల్లాలో పశువుల పండుగ హడావిడి మొదలైపోయింది. కోవిడ్ నిబంధనలను పట్టించుకోకుండా..పోలీసుల అనుమతి లేకుండా రామచంద్రాపురం మండలం కూనేపల్లిలో పరుష పందెం నిర్వహించారు. పశువులను అలంకరించి వాటికి తలలకు బహుమతులు కట్టి....వాటిని చేజిక్కించుకునేందుకు యువకులు పోటీ పడ్డారు. ఈ ప్రయత్నాల్లో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు గ్రామంలోకి రావటంతో...ఇరువర్గాలకు వాగ్వాదం రేగింది.