Pasupu Farmers : MP Aravind ను రానివ్వకుండా అడ్డుకుంటామని పసుపు రైతుల ఆందోళన
Continues below advertisement
నిజామాబాద్ జిల్లాలో పసుపుబోర్డు వివాదం రాజుకుంటోంది. ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తెస్తానన్న హామీతో ఎన్నికల్లో గెలిచి పసుపు బోర్డు అంశాన్ని మరుగున పడేశారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పసుపు బోర్డు తెచ్చేవరకు అరవింద్ ను గ్రామాల్లో తిరగనివ్వబోమని పసుపు రైతులు హెచ్చరిస్తున్నారు. అరవింద్ ఆర్ముర్ నియోజకవర్గంలోని చిన యానాం, నడకూడ, దేగామ్ గ్రామాల్లో పర్యటించనున్నట్లు ముందుగా తెలుసుకున్న పసుపు రైతులు ఆయా గ్రామాల్లో రోడ్లపైకి వచ్చి అరవింద్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పసుపు బోర్డు తెచ్చే వరకు పోరాటం ఆగదంటున్నారు పసుపు రైతులు. మరోవైపు పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చినా పట్టించుకోవటం లేదని, తెరాస నాయకులకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని అరవింద్ ఆరోపిస్తున్నారు.
Continues below advertisement