Pardesi Pedamma Kathalu|MR Pellam| సాటిలేని మేటి లేడీ ఓరియెంటెడ్ సినిమా 'మిస్టర్ పెళ్లాం'

దర్శకరచయితలు బాపు రమణల దృశ్యకావ్యం....మిస్టర్ పెళ్లాం. రాజేంద్రప్రసాద్, ఆమని జంటగా నటించిన ఈ కుటుంబ కథా చిత్రం 1993లో విడుదలై మహిళల సత్తాను ఎలుగెత్తి చాటింది. శ్రీ చాముండి చిత్ర పతాకంపై బాపు దర్శకత్వంలో గవర పార్థ సారథి నిర్మించాడు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రానికి మూలం హాలీవుడ్ లో విడుదలైన మిస్టర్ మామ్ చిత్రం. అయినా తెలుగు నేటివిటీకి తగ్గట్లుగామార్చి తీసిన ఈ చిత్రంలో...మహిళలు అంటే వంటింటికే పరిమితం కావాలనే సంకుచిత భావజాలాన్ని బద్దలుకొట్టి స్త్రీ,పురుష సమానత్వాన్ని ఘనంగా చాటింది. తెలుగులో ఉత్తమ చలన చిత్రంగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న మిస్టర్ పెళ్లాంపై మెలనీ గ్రీన్ బర్గ్ అందిస్తున్న విశ్లేషణ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola