Panja Vaishnav Tej: రంగరంగవైభవంగా నుంచి రిలీజ్ కానున్న కొత్త పాట.. ఎప్పుడంటే..?
ఉప్పెన, కొండపొలం తర్వాత పంజా వైష్ణవ్ తేజ్ 'రంగరంగవైభవంగా' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో వైష్ణవ్ సరసన 'రొమాంటిక్' ఫేం కేతికా శర్మ నటించనున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయగా.. అందులో 'బటర్ ఫ్లై కిస్' గురించి వివరిస్తూ ఉన్న డైలాగ్ హిట్ కొట్టిందని ప్రకటించారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు సినిమాలోని 'తెలుసా.. తెలుసా' పాటను ఫిబ్రవరి 3న విడుదల చేయనున్నట్లు తెలిపారు.