Padma Awards Rejection: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులను తిరస్కరించిన ఆముగ్గురూ

Continues below advertisement

కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డులను ఇప్పటివరకూ ముగ్గురూ తిరస్కరించారు. వెస్ట్ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య పద్మభూషణ్ ను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. అవార్డు తీసుకునేందుకు ఆయన నిరాకరించారు. తనకూ పద్మశ్రీ వద్దని ప్రముఖ గాయని సంధ్యముఖర్జీ తిరస్కరించారు. ప్రముఖ తబలావాయిద్య కారుడు అనింద్యఛటర్జీకి కేంద్రం పద్మశ్రీని ప్రకటించగా.....దానిని తిరస్కరిస్తున్నట్లు అనింద్యఛటర్జీ ప్రకటించారు. పదేళ్ల క్రితమే తనకు అవార్డు రావాల్సిందని...ఇప్పటికే ఆలస్యమైందని తన జూనియర్లు అందరికీ వచ్చిన తర్వాత ఇవ్వటం సరికాదన్నారు అనింద్యఛటర్జీ. పద్మ అవార్డులను తిరస్కరించిన ముగ్గురూ వెస్ట్ బెంగాల్ వాళ్లే కావటం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram