Operation Parivarthan : విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమం
విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమం నిర్వహించారు. చింతపల్లి మండలం తమ్మంగుల, కుడుముసారి పంచాయతీ గ్రామాలైన కిలిమిసింగి, దానుడివీధి, దబ్బగరువు ప్రాంతంలో గంజాయి తోటలను అధికారులు ధ్వంసం చేశారు. గ్రామస్తులకు అవగాహన కల్పించిన అధికారులు వారి సహకారంతో 87ఎకరాల్లో గంజాయి తోటలను నాశనం చేశారు.