Ongole YCP Subbarao: ఒంగోలు వ్యవహారం పై మంత్రి బాలినేని రియాక్షన్.
మతిస్థిమితం లేకే గుప్తా ఆరోజు సభలో ఆ వ్యాఖ్యలు చేశారని వివరించారు. అటువంటి వ్యక్తి చేసిన వ్యాఖ్యలపై నేనేం మాట్లాడాలని ప్రశ్నించారు. వివిధ పార్టీల జెండాలను గుప్తా విక్రయిస్తుండడంతో అన్ని పార్టీల నేతలతో ఆయనకు పరిచయం ఉందని అతడితో ఎవరైనా ఈ మాటలు అనిపించారా అనే అనుమానం వ్యక్తమవుతుందన్నారు. పార్టీలో ఉండి విమర్శించడంతో నా అనుచరులు బాధతో దాడి చేసి ఉంటారన్నారు.