Omicron Cases on rise: 24 గంటల్లో దేశంలో రెండు లక్షలకు పైగా Corona Cases

దేశంలో Corona క్రమంగా కమ్మేస్తోంది. 24 గంటల వ్యవధిలో సుమారు (2Lakh Cases) రెండు లక్షల కేసులు రిజిస్టర్ అయ్యాయి. దేశవ్యాప్తంగా లక్షా94వేల 720 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మధ్యకాలంలో ఇదే అత్యధిక కేసులు. ఇది ఓవరాల్‌గా 15.8 శాతం పెరిగినట్టు లెక్క. ఇందులో 4, 868 Omicron కేసులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. మొత్తం కేసుల్లో 1805 మంది రికవరీ అయ్యారు. ఈ కేసుల్లో ఎక్కువ మహారాష్ట్ర నుంచి వస్తున్నాయి. 1281 కేసులతో దేశంలోనే ఎక్కువ కేసులు రిజిస్టర్ అవుతున్న రాష్ట్రంగా ఉంది. దీని తర్వాత రాజస్థాన్‌ ఉంది. అక్కడ ఒక్కరోజులో 645 కేసులు వెలుగులోకి వచ్చాయి. మూడో స్థానంలో ఉన్న దిల్లీలో 546 కేసులు బయటపడ్డాయి. కేంద్ర ఆరోగ్య శాఖ ఇస్తున్న లెక్కల ప్రకారం ఇరవై నాలుగు గంటల్లో దేశవ్యాప్తంగా 442 మంది చనిపోతే... 60, 405 మంది వైరస్‌ బారి నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola