Omicron Cases: క్రాస్ వ్యాక్సినేషన్ పై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి..ఇప్పుడే ఏం చెప్పలేం
క్రాస్ వ్యాక్సినేషన్ పై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయని...ఇప్పుడప్పుడే ఏదీ నిర్థారణకు రాలేమని ప్రముఖ చెస్ట్ ఫిజిషీయన్, అనంతపురంలో ప్రముఖవైద్యులు డా.సతీష్ తెలిపారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ జాగ్రత్తగా ఉంటే సరిపోతుందన్న ఆయన..మొదటి రెండు దశల కంటే ఇదేమంత ఉద్ధృతమైంది కాదన్నారు. భౌతిక దూరం పాటించటం, మాస్క్ ధరించటం వంటి కోవిడ్ నిబంధనలను పాటిస్తే వైరస్ వ్యాప్తి నుంచి బయటపడొచ్చంటున్న డా. సతీష్ తో ముఖాముఖి.