Omicron Cases: విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో స్పెషల్ వార్డుల ఏర్పాటు
ఏపీలో కోవిడ్ కేసులతోపాటు ఓమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది . విశాఖ పట్నంలో గత కొన్నిరోజులుగా పెరుగుతున్న కోవిడ్ పేషేంట్ల సంఖ్యా రీత్యా నగరంలోని ప్రఖ్యాత కేజీహెచ్ హాస్పిటల్ లో స్పెషల్ వార్డు లను ఏర్పాటు చేశారు . కలవాసిన బెడ్ లతో పాటు ఆక్సిజన్ యూనిట్ లను సిద్ధం చేశారు .రవాణా రీత్యా దేశ విదేశాలతో డైరెక్ట్ కనెక్ట్ ఉన్నఉన్న నగరం కావడంతో కేసుల పెరుగుదలపై వైజాగ్ సిటీ ఆందోళన కలిగిస్తుంది. ఇక సంక్రాంతి పండుగ రద్దీ కూడా అధికార ,వైద్య ఆరోగ్య యంత్రాంగాలను కలవరపెడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందుగానే అన్ని ఏర్పాట్లనూ సిద్ధం చేస్తుంది .