జమ్మలమడుగులో ఫ్లెక్సీల రగడ... ఆ ముగ్గురు ఆ పార్టీ వారేనా?
కడప జిల్లా జమ్మలమడుగులో ఫ్లెక్సీల రగడ రాజుకుంది. పట్టణంలో వైసీపీ, టీడీపీ, బీజేపీ పార్టీలు పోటాపోటీగా సంక్రాంతి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి టీడీపీ, బీజేపీకి చెందిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించేయగా జమ్మలమడుగులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఎలాంటి గొడవలు జరగకుండా ఆపారు. అర్థరాత్రి ... ముగ్గురు వ్యక్తులు ఫ్లెక్సీలను చింపుతున్నట్లు సీసీ ఫుటేజీలో కనిపించింది. అయితే ఇది వైసీపీ కార్యకర్తల పనేనని బీజేపీ, టీడీపీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆకతాయిల పనా.. లేదా ఎవరైన ఉద్దేశపూర్వకంగా చేశారా అనేది పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.