KADAPA CRIME: యజమాని డబ్బుతో పరారీ, ఇద్దరు అరెస్ట్
బ్యాంకులో జమ చేయాలని యజమాని ఇచ్చిన డబ్బుతో ఉడాయించిన ఇద్దరు యువకులను కడప టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద ఆరున్నర లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచిన డీఎస్పీ వెంకట శివారెడ్డి... క్రైం వివరాలను వెల్లడించారు. గౌస్ నగర్, బాదుల్లా సాహెబ్ మఖాని వీధికి చెందిన రెస్వంత్ కుమర్, ఖాజావలీ.... మాసాపేటలోని ఓ చికెన్ సెంటర్ లో పనిచేస్తున్నారు. బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయాలని యజమాని కిశోర్ రెడ్డి వారికి 7లక్షల 90 వేల రూపాయలను ఇవ్వగా వాటితో ఉడాయించినట్టు పోలీసులు తెలిపారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.