ఫీజు రీయింబర్సుమెంట్ నిధులను విడుదల చేయాలంటూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన..
విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ ను విద్యార్థులు ముట్టడించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు వలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగాన్ని నిర్విర్యం చేసేలా ప్రభుత్వం ప్రవర్తిస్తుందని , స్కాలర్షిప్, ఫీజు రీయింబర్సుమెంట్ నిధులను విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం జగన్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక యూ టర్న్ తీసుకున్నారన్నారు. జీవో నెంబర్ 77 రద్దు చేయాలని లేకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లాలని ప్రయత్నించిన విద్యార్థి సంఘ నేతలను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.