Nursing Students protest: తమ సమస్యలు పరిష్కరించాలని నర్సింగ్ విద్యార్థినుల ఆందోళన
హనుమకొండ (Hanumakonda) జిల్లాలోని కాజీపేటలో నర్సింగ్ విద్యార్థినులు ఆందోళన బాటపట్టారు. తరగతులు బహిష్కరించి రోడ్డుపై బైఠాయించారు. కళాశాలలో విద్యార్థినులకు కొవిడ్ (Covid)సోకుతున్నా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు సరైన ఆహారం అందించట్లేదని, హాస్టళ్లలోనే క్వారంటైన్ చేస్తున్నారని ఆవేదన చెందారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ కళాశాల ముందు కూర్చుని నినాదాలు చేశారు.