Numaish 2022: పెరుగుతున్న కోవిడ్ కేసులతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Continues below advertisement

కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండంటో.. నాంపల్లి నుమాయిష్ పై కీలక నిర్ణయం తీసుకుంది ఎగ్జిబిషన్ సొసైటీ. ఈ ఏడాది నుమాయిష్ రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న కారణంగా.. తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ.. జీవీ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొదట నుమాయిష్ 10 రోజులపాటు వాయిదా వేశారు. కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో.. పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది. ప్రస్తుతం.. ఎగ్జిబిషన్‌ నిలిపివేయడంపై సొసైటీ అభ్యంతరం వ్యక్తం చేసి.., ఎగ్జిబిషన్ నిలిపివేయడం సరికాదని సొసైటీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. సోసైటీ వాదనలపై హైకోర్టు.. ఘాటుగా స్పందించింది. ఓ వైపు.. కరోనా, ఒమిక్రాన్​ వంటి పరిస్థితుల్లో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారని..., ఈ సమయంలో ఎగ్జిబిషన్ కావాలా? అంటూ ప్రశ్నించింది. ఎగ్జిబిషన్ నిర్వహణపై ప్రభుత్వమే.. నిర్ణయం తీసుకుంటుందని.. అభిప్రాయపడింది. కరోనా పరిస్థితుల్లో.. ఎగ్జిబిషన్ పై.. నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని స్పష్టం చేసింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram