Bandi Sanjay: లాఠీఛార్జ్ లో గాయపడ్డ భాజపా నాయకుల ఆవేదన
జీవో నంబర్ 317కు వ్యతిరేకంగా భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిరసనకు మద్దతు తెలుపుతూ తాము తలపెట్టిన దీక్షలో పోలీసులు దారుణంగా ప్రవర్తించారని భాజపా కరీంనగర్ నాయకులు ఆరోపించారు. తమ మహిళా కార్యకర్తలపై లాఠీఛార్జ్ ను ఆపడానికి ప్రయత్నిస్తే... తమపై లాఠీలతో విరుచుకుపడ్డారని వాపోయారు. బండి సంజయ్ విడుదల తర్వాత ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో గాయపడ్డ నాయకులను పలువురు పరామర్శించారు. మొన్నటి ఘటనను గుర్తుచేసుకున్న క్షతగాత్రులు... ఇప్పటికీ కొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు.