NTR Statue: అందరూ చూస్తుండగానే సుత్తితో ఎన్టీఆర్ విగ్రహంపై విధ్వంసకాండ
గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని, దుర్గి మండల కేంద్రంలో పట్టపగలే అందరూ చూస్తుండగానే జడ్పీటీసీ సభ్యుడు శెట్టిపల్లి యలమంద తనయుడు శెట్టిపల్లి కోటేశ్వరరావు అనే వ్యక్తి ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నం చేశారు. అధికార పార్టీ అండదండలతో విధ్వంసాలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు..