Newborns : నవజాత శిశువులకు పునర్జన్మ ఇచ్చిన కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నలుగురు గర్భిణీలు కేవలం ఎనిమిది వందల గ్రాములుతో బిడ్డలకు జన్మనిచ్చారు. వీరందర్నీ ప్రభుత్వాసుపత్రిలో ని నవజాతి శిశువు విభాగంలో ఉంచి, వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేక శ్రద్ధ వహించి, వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్ది, తల్లులకు అప్పజెప్పారు. పౌష్టికాహార లోపం వివిధ కారణాలతో తక్కువ బరువుతో పసికందులు జన్మిస్తారని చెప్పారు.బరువు పెరిగిన నవజాత శిశువు ను చూస్తూ తల్లులు మురిసిపోయారు. ఆసుపత్రి వర్గాలకు బిడ్డల తల్లులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.