New Covid Variant : ఒమిక్రాన్ కన్నా ప్రాణాంతక వేరియంట్ వచ్చేసిందా?

Continues below advertisement

Wuhanలోని శాస్త్రవేత్తలు... NeoCov అనే కొత్త కొవిడ్ వేరియంట్ గురించి ప్రపంచాన్ని అప్రమత్తం చేశారు. దీని కారణంగా నమోదయ్యే మరణాల రేటు, వ్యాప్తి రేటు చాలా ఎక్కువని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఇస్తున్న వ్యాక్సిన్ల వల్ల ఈ కొత్త వేరియంట్ల నుంచి రక్షణ లభిస్తుందని కచ్చితంగా చెప్పలేమన్నారు. ఇంతకుముందు ఈ NeoCov వైరస్ 2012,2015లో మిడిల్ ఈస్ట్ దేశాల్లో గుర్తించారు. అప్పుడు అక్కడ కొన్ని వ్యాధులు ప్రబలాయి. ఈ వేరియంట్ ను దక్షిణాఫ్రికాలో చాలా గబ్బిలాల్లో గుర్తించారు. ప్రస్తుతం ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తున్నా... మరణాల రేటు డెల్టా కన్నా తక్కువే ఉంది. కానీ ఈ NeoCov వేరియంట్ వల్ల వైరస్ ఇన్ఫెక్ట్ అయిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయే అవకాశముందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram