Netaji Hologram Statue: ఇండియా గేట్ వద్ద సుభాష్ చంద్రబోస్ హోలోగ్రామ్ విగ్రహం ఆవిష్కరణ| ABP Desam
ఇండియా గేట్ వద్ద నేతాజీ హోలో గ్రామ్ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. నేతాజీ జన్మదినం సందర్భంగా ఆయన పుట్టినరోజును దేశవ్యాప్తంగా జాతీయ పరాక్రమ్ దివస్ గా నిర్వహించింది కేంద్రం. ఇండియాగేట్ దగ్గర నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న కేంద్రం...ఆ విగ్రహం పూర్తయ్యేవరకూ నేతాజీ హోలోగ్రామ్ విగ్రహం రూపంలో కనిపించేలా ఏర్పాట్లు చేసింది. విగ్రహ ఆవిష్కరణ అనంతరం ప్రధాని మోదీ ఆపద ప్రబంధన్ పురస్కారాలను పంపిణీ చేశారు.