Nepal: అక్కడ కాలు బయటపెట్టాలంటే వ్యాక్సినేషన్ కార్డు ఉండాల్సిందే
ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నందున.. చాలా దేశాలు కొవిడ్ ఆంక్షలను కఠినతరం చేసాయి. ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని.. మస్కులు ధరించాలని సూచిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కొత్త రూల్ పెట్టింది. బహిరంగ ప్రదేశాల్లో తిరగాలంటే కచ్చితంగా రెండు డోసులు పూర్తయిన కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ను చూపించాలని వెల్లడించింది. దీంతోపాటు భారత్ నుంచి నేపాల్ వెళ్లేవారికి సరిహద్దుల్లోనే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేసి క్వారంటైన్ ఉంచాలని నిర్ణయించింది.