మద్యం ధరల తగ్గింపుపై నెల్లూరులో మహిళల వినూత్న నిరసన..
మహిళలంతా ఓ గ్రూప్ గా ఏర్పడి ఉదయాన్నే మద్యం షాపుకి వెళ్లారు. బీరు బాటిళ్లు కొనుక్కున్నారు. ఆ తర్వాత రోడ్డుపైకి వచ్చారు. అంతే.. అక్కడ్నుంచి ఒక్కసారిగా సీఎం జగన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేసి బీరు బాటిళ్లను నడిరోడ్డుపై పగలగొట్టారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ మహిళా విభాగం నేతలు వైన్ షాపుల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు మహిళా నేతలు ఇలా వైన్ షాపు ముందు వినూత్న నిరసన చేపట్టారు.