Nellore Temples Rush : కొత్త సంవత్సరం భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
నూతన సంవత్సరం తొలి రోజున నెల్లూరు ప్రజలంతా ఆలయాలకు క్యూ కట్టారు. నెల్లూరులో ప్రధానంగా రాజ రాజేశ్వరి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పిల్లలు, పెద్దలు ఉదయాన్నే ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. జనవరి ఫస్ట్ సందర్భంగా రాజరాజేశ్వరి ఆలయాన్ని అందంగా పూలతో అలంకరించారు. భక్తులకోసం క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భక్తుల తాకిడి తగ్గలేదు.