Nellore Police uniform: ఫోటోలు తీసిన వారిపై చర్యలు తీసుకోండన్న నెల్లూరు మహిళా పోలీసులు.

Continues below advertisement

Nellore మహిళా పోలీసుల యూనిఫామ్ కొలతలు తీసేందుకు పురుషులను వినియోగించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. పురుషులను అసలు వినియోగించలేదని, కేవలం కొలతలు నోట్ చేసుకోడానికి మాత్రమే దర్జీలు వచ్చారని SP Vijayarao క్లారటీ ఇచ్చారు. అయితే ఈ ఘటనపై మహిళాపోలీసులతో కలసి ASP Venkata Ratnamma ప్రెస్మీట్ పెట్టారు. కొలతలు ఎలా తీసుకోవాలో చెప్పే క్రమంలో పురుషులు వారికి సూచనలు ఇచ్చారని, సెన్సిటివ్ ఇష్యూ ని రాజకీయం చేయొద్దని కోరారు. కొలతలు తీసే క్రమంలో లోపలికి వచ్చి ఫోటోలు తీసిన వారిపై చర్యలు తీసుకోవాలని మహిళా పోలీసులు కోరుతున్నారని ఆమె చెప్పారు. ఫోటోలు తీయడానికి అనుమతి లేకుండా లోపలికి రావడం సరికాదని, వాటిని వైరల్ చేయడం సరికాదని మహిళా పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram