Nellore Corona Cases: నెల్లూరు జిల్లాలో కరోనా కలకలం.. కమ్మవారిపాలెంలో కంటైన్మెంట్ జోన్.
రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఒమిక్రాన్ భయం నెలకొంది. ఏపీలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఫీవర్ సర్వే తో కొత్త కేసులు బయటపడుతున్నాయి. సర్వేలో బయటపడుతున్న కొత్త కరోనా కేసులు ఇటు అధికారులను సైతం పరుగులు పెట్టిస్తున్నాయి. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కమ్మవారి పాలెంలో
ఒకేరోజు 11మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. దీంతో ఆ గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించిన అధికారులు.....గ్రామంలోకి ప్రవేశాన్ని నిషిద్ధం చేసి వైరస్ కట్టడికి యత్నాలు చేస్తున్నారు