Nellore: కళాకారుల పొట్టకొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన నెల్లూరు జిల్లా కళాకారులు
Continues below advertisement
చింతామణి నాటకాన్ని రద్దు చేసి జగన్ కళాకారుల పొట్టకొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా కళాకారులు. రాష్ట్రవ్యాప్తంగా చింతామణి నాటకాన్ని నమ్ముకుని దాదాపు 30వేలమంది కళాకారులున్నారని, నెల్లూరు జిల్లాలోనే మొత్తం 3వేలమంది కళాకారులు చింతామణి నాటకంపై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ తోపాటు, తెలంగాణ, ఒడిశా, కేరళ, కర్నాటకలో కూడా చింతామణి నాటకం బాగా ఫేమస్ అని అన్నారు. చింతామణి నాటకాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ నెల్లూరు నగరంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. చింతామణి నాటకంలోని పాత్రధారుల వేషాల్లో నిరసనలో పాల్గొన్నారు.
Continues below advertisement