Nasa Perseverance: మార్స్ పై రాక్ శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్న నాసా పర్సెవరెన్స్
అంగారకుడిపై పరిశోధనల నిమిత్తం నాసా పంపించిన పర్సెవరెన్స్ మార్స్ రోవర్ అద్భుతాలే చేస్తోంది. అత్యంత దుర్భేధ్యమైన తన రోబోటిక్ హ్యాండ్ తో మార్స్ పై బండరాళ్లను డ్రిల్లింగ్ చేస్తోంది. రాళ్లలోపల దాగున్న అంగారకుడి అసలు సత్యాలను రాబట్టేందుకు మార్స్ రోవర్ తన పనిని మొదలు పెట్టింది. డ్రిల్లింగ్ చేసి సేకరించిన రాళ్ల నమూనాలను త్రీడీ మ్యాపింగ్ ద్వారా చిత్రాలుగా మార్చి....నాసా కమాండ్ సెంటర్ కి పంపిస్తోంది. తద్వారా ఆ నమూనాలపై నాసా శాస్త్రవేత్తలు లోతైన పరిశోధన చేసేందుకు వీలు కలుగుతోంది.