Nasa James Webb: విచ్చుకున్న నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సోలార్ షీల్డ్స్
విశ్వం ఆవిర్భావం రహస్యాలను తెలుసుకునేందుకు నాసా ప్రయోగించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తన కక్ష్యలో విజయవంతంగా తిరుగుతోంది. విశ్వం ఆవిర్భావం నాటి తొలి నక్షత్రాలను, గెలాక్సీలను పరిశోధించేందుకు నిర్దేశించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పూర్తిస్థాయిలో పనిని ప్రారంభించేందుకు సన్నద్ధం అవుతోంది. అన్ ఫోల్డ్ యూనివర్స్ గురించి తెలుసుకునేందుకు...పూర్తిగా ఫోల్డింగ్ స్టేజ్ లో రాకెట్ లాంఛ్ కాగా....ఇప్పుడు టెలిస్కోప్ కి సంబంధించిన ముడుచుకుని ఉన్న భాగాలన్నీ ఒక్కొక్కటిగా విచ్చుకుంటున్నాయి. ప్రత్యేకించి టెలిస్కోప్ విధులకు సహకరించే సోలార్ ప్లేట్లు, సన్ షీల్డ్ ప్రొటక్షన్ లేయర్లు ఇప్పటికే విచ్చుకుని తమ క్రియాస్థితికి చేరుకున్నాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం జూన్ 2022 నాటికి పూర్తిగా సిద్ధమై...తన తొలి చిత్రాన్ని నాసా వెబ్ టెలిస్కోప్ పంపించనుందని భావిస్తున్నారు