Nara Chandra Babu Naidu: పవన్ కల్యాణ్ తో వచ్చే ఎన్నికల్లో పొత్తుపై చంద్రబాబు ఫన్నీ ఆన్సర్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం వీర్నమల తాండాలో చంద్రబాబు పర్యటనలో టీడీపీ కార్యకర్తను ఒకతను ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకోవాలని..కలిసి పోటీ చేయాలని చంద్రబాబును కోరారు. కార్యకర్త ప్రశ్నకు సరదాగా సమాధానం ఇచ్చిన చంద్రబాబు...లవ్ ఎప్పుడూ రెండు వైపులా ఉండాలన్నారు. ఏకపక్షంగా లవ్ చేయడం కరెక్ట్ కాదని చంద్రబాబు చమత్కరించటంతో సభలో నవ్వులు విరిసాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola