Nandyala : నంద్యాలలో అధికార పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్న నేతలు

Continues below advertisement

కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలో అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అలకలు మొదలయ్యాయి. వైసిపి సీనియర్ నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా కార్యాలయాలను ఏర్పాటు చేసుకొని గ్రూపును తయారుచేసుకున్నారు.అయితే ఆ నేతలను బుజ్జగించే పనిలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి విఫలమయ్యారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.అయితే గత 22 సంవత్సరాలుగా శిల్ప వర్గాన్ని నమ్ముకొని వారికి చేదోడు వాదోడుగా న్యాయపరంగా పార్టీ సూచనలు సలహాలు ఇస్తూ వున్నా, ప్రాధాన్యత వుండట్లేదని బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు మాజీ సర్పంచ్ తులసిరెడ్డి, సీనియర్ నేత రాజగోపాల్ రెడ్డి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram