Minister Dharmana: క్రీడల వల్లే తనకు గుర్తింపు వచ్చిందన్న మంత్రి ధర్మాన
శ్రీకాకుళంలో ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫెన్సింగ్ పోటీలను ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. కృష్ణదాస్ ఫెన్సింగ్ లో పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. చిన్నతనం నుంచి తమ్ముడికి రాజకీయాలంటే, తనకు క్రీడలంటే ఇష్టమన్నారు. క్రీడల్లో ఉండబట్టే తనకు కళాశాలలో సీటు దక్కిందన్నారు. ఒకప్పుడు పెద్దగా ప్రాచుర్యంలో లేని ఫెన్సింగ్ ఇప్పుడు ప్రతి మూలకూ విస్తరించిందన్నారు. ముఖ్యమంత్రి జగన్ క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, వార్డు వాలంటీర్లలో 2 శాతం క్రీడాకారులకు అవకాశం ఇవ్వాలని సీఎంను కోరినట్టు తెలిపారు.