Nandyal Car: నంద్యాల వెంకటాచలం కాలనీలో ఓవర్ స్పీడ్ తో కారు బీభత్సం
నంద్యాలలో ఓ కారు బీభత్సం సృష్టించింది. వెంకటాచలం కాలనీలో అతివేగంతో దూసుకువచ్చిన కారు అదుపు తప్పి పాదచారులపై దూసుకెళ్లింది. దీంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.