Nagarjuna sagar| నాగర్జున సాగర్ ఎడమ కాల్వకు గండి.. ముంపు భయాల్లో గ్రామాలు | ABP Desam
నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు గండి పడింది. నిడమనూరు మండలం ముప్పారం సమీపంలో గండి పడినట్లుగా స్థానికులు చెబుతున్నారు. దీంతో సమీపంలోని పంట పొలాలు నీట మునిగాయి. నీటి ప్రవాహం అధికంగా ఉండడం... మట్టికట్ట బలహీనంగా ఉండటంతో గండి పడినట్లు తెలుస్తుంది. స్థానికులు జలాశయ అధికారులకు సమాచరం ఇవ్వడంతో నీటి విడుదలను ఆపేశారు.