MP Revanth Reddy : రామకృష్ణ కుటుంబం బలై మూడు రోజులైనా చర్యలెందుకు తీసుకోలేదు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కుటుంబం తో సహా ఆత్మహత్యకు పాల్పడిన నాగ రామకృష్ణ సంఘటన లో, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవ పేరు రావడం పై తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రామకృష్ణ కుటుంబం బలై మూడు రోజులైనా చర్యలెందుకు లేవు? మొదటి రోజు నుంచే రాఘవ పేరు తెరమీదకు వచ్చింది. అరెస్టు ఎందుకు చేయలేదు? ఎవరు కాపాడుతున్నారు? ఎమ్మెల్యే కుమారుడు అరాచకాలు చేస్తుంటే ముఖ్యమంత్రి కి తెలియకపోవడం ఏమిటి? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది? అని ప్రశ్నించారు.