MP MithunReddy: పార్టీని కాపాడుకునేందుకే చంద్రబాబు ముందస్తు ఎన్నికలు అంటుంటారు

వైసీపీ ప్రభుత్వానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని వైసీపి ఎంపీ మిధున్ రెడ్డి స్పష్టం చేశారు.. ఇవాళ తిరుపతిలోని రోబో డైనర్ హోటల్ నూతనంగా రూపొందించిన మొబైల్ యాప్ ను వైసీపి ఎంపీ మిధున్ రెడ్డి ప్రారంభించారు..ఈ‌ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీని కాపాడుకునేందుకే చంద్రబాబు నాయుడు తరచుగా ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతుంటారని ఆరోపించారు..ముందస్తుగా వైసీపి ఎన్నికలకు వెళ్ళే ఆలోచనే లేదని, ఐదేళ్ల పూర్తి కాలం అధికారంలో ఉంటాంమని ధీమా వ్యక్తం చేశారు.. ప్రేక్షకులకు, థియేటర్ల యాజమాన్యానికి ఇద్దరికీ నష్టం కలగకూడదని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు..సినిమా టికెట్ ధరలపై కమిటీ నిర్ణయం మేరకు నడుచుకుంటాంమని, మా కుటుంబంపై ఆరోపణలు చేసిన కొండ్రెడ్డి అనే వ్యక్తిపై చాలా కేసులు ఉన్నాయని, బస్సు దోపిడీ లాంటి కేసులు కూడా అతనిపై నమోదు అయినట్లు ఎంపీ మిధున్ రెడ్డి తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola