MP Galla Jayadev: ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించినా రైతుల పాదయాత్ర ఆగలేదు
అమరావతి రైతుల న్యాయస్ధానం-దేవస్ధానం మహా పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది. 42వ రోజు రేణిగుంట మండలం అంజిమేడు గ్రామం నుంచి ప్రారంభంమైన ఈ మహా పాదయాత్ర దాదాపుగా 16 కిలో మీటర్లకు పై కొనసాగి రేణిగుంటకు చేరుకుంది. రాత్రికి రేణిగుంటలోని పాత చెక్ పొస్టు వద్ద ఉన్న వై.కన్వెన్షన్ హాల్, రాజమాత కళ్యాణ మండపంలో రైతులు బస చేయనున్నారు. తిరిగి రేపు ఉదయం రేణిగుంట నుండి మహా పాదయాత్ర బయల్దేరి తిరుపతికి చేరుకోనుంది. పాదయాత్రగా వచ్చిన రైతులను ఎంపీ గల్లా జయదేవ్, డాక్టర్ రమాదేవిలు మర్యాద పూర్వకంగా కలిసి తమ మద్దతు తెలిపారు.