MP CM Ramesh: పంజాబ్ లో ప్రధాని మోదీ భద్రతావైఫల్యంపై ముమ్మాటికి కాంగ్రెస్ తప్పు
పంజాబ్ లో ప్రధాని మోదీకి భద్రతా వైఫల్యం అక్కడి ప్రభుత్వ అసమర్థతే అని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన....పోలీస్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం చెప్పు చేతల్లో ఉంటుందన్నారు. ఏపీలోనూ దళితులపై దాడులు ఆగటం లేదన్న సీఎం రమేష్...పోలీస్ వ్యవస్థ రాష్ట్రప్రభుత్వం చెప్పు చేతల్లో ఉంటోందన్నారు. పోలీసులు పార్టీ కండువాలు కప్పుకుని పనిచేస్తున్నారన్న ఆయన...ఏపీలో పోలీస్ వ్యవస్థను బాగు పరచాల్సిన అవసరం ఉందన్నారు.