MP CM Ramesh : ఈనెల 28వ తేదీన బిజెపి ఆధ్వర్యంలో ప్రజాగ్రహసభలు
బీజేపి రాజ్య సభ సభ్యుడు అయిన సీఎం రమేష్ విజయవాడ లో మీడియాతో మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ వైఖరి పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అవినీతి ప్రజా వ్యతిరేక విధానాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. పోలీసు సహా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఇసుక మద్యం, మైనింగ్ రంగాల్లో జరుగుతున్న అవినీతిని, అక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమరావతిని నిర్వీర్యం చేశారని, పోలవరం ప్రాజెక్టు పనులు ఆగిపోయాయని అన్నారు. కేవలం పట్టింపులకు పోయి సినిమా పరిశ్రమని నియంత్రణలోకి తీసుకోవాలని చూస్తున్నారని అన్నారు.