MP Aravind : అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఎంపీ అర్వింద్ పై కేసు నమోదు
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. పోలీసులను ఉద్దేశించి జనవరి 3న తన నివాసం వద్ద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు అర్వింద్ పై కేసు పెట్టాలంటూ బంజారాహిల్స్ ఇన్స్ పెక్టర్ శివచంద్ర ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎంపీ అర్వింద్ పై ఐపీసీ సెక్షన్ 294, 504, 5051(1),(b) కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.