Minister Mekapati : ఉద్యోగులపై మంత్రి మేకపాటి ఫైర్
నెల్లూరు జిల్లా సంగం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో కొందరు ఉద్యోగులపై మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి ఆలస్యంగా వచ్చినందుకు సంగం రెవెన్యూ ఇన్స్పెక్టర్ పై నిప్పులు చెరిగారు. అతణ్ని వెంటనే రిలీవ్ చేయాలంటూ అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. “నీ చరిత్ర అంతా నాకు తెలుసు. ఇక్కడ చేరి ఏమేం చేశావో నాకు తెలుసు. తమాషాలు చేస్తున్నావా” అంటూ మండిపడ్డారు. క్రమశిక్షణ అలవర్చుకోకపోతే తానే నేర్పిస్తానంటూ కోప్పడ్డారు.