Money Heist: నెక్లెస్ రోడ్ లో ఆకట్టుకుంటున్న భారీ స్ట్రీట్ ఆర్ట్స్‌

Continues below advertisement

మనీ హీస్ట్ ఫీవర్.. హైదరాబాద్‌ను తాకింది. భారీ స్ట్రీట్ ఆర్ట్‌తో నెట్‌ఫ్లిక్స్.. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొనే పనిలో పడింది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే ‘మనీ హీస్ట్’ వెబ్ సీరిస్‌కు ఎంత ప్రేక్షకాధరణ ఉందో తెలిసిందే. మొదటి సీజన్ నుంచి చివరి సీజన్ వరకు ఎంతో ఉత్కంఠభరితంగా సాగే ఈ సీరిస్‌‌ ఎట్టకేలకు ముగిసింది. అయితే, ప్రేక్షకులు మాత్రం ఆ ఫీవర్ నుంచి బయటకు రావడం లేదు. ముఖ్యంగా ఇండియాలో ఈ వెబ్‌ సీరిస్‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘మనీ హీస్ట్’లోని తారాగణం కూడా భారతీయుల అభిమానానికి ఫిదా అయ్యారు. ‘నెట్ ఫ్లిక్స్’ కూడా ఈ అభిమానాన్ని సొమ్ము చేసుకొనేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram