MLA Roja: మంత్రి బొత్స సత్యనారాయణతో రోజా భేటీ
ఆంధ్రప్రదేశ్ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా విజయవాడలో భేటీ అయ్యారు. తన నియోజకవర్గంలోని పుత్తూరు మున్సిపాలిటీ సమస్యలపై వినతిపత్రం అందించారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ప్రస్తుత పరిస్థితిని మంత్రికి వివరించారు. ట్యాంకు పనులకు పరిపాలనా అనుమతి మంజూరు చేస్తామని బొత్స హామీ ఇచ్చారు. నగరిలో జరుగుతన్న అర్బన్ హౌసింగ్ కాలనీ పనులను బొత్సతో రోజా చర్చించారు. నగరి, పుత్తూరు మున్సిపాలిటీల్లో కాంట్రాక్టర్లకు రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని కోరారు. తగు చర్యలు తీసుకుంటామని బొత్స హామీ ఇచ్చారు.