MLA Roja: చంద్రబాబు కుప్పం పర్యటనపై నగరి ఎమ్మెల్యే రోజా విమర్శలు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనపై నగరి ఎమ్మెల్యే రోజా విమర్శలు చేశారు. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవారిని సేవించుకున్న ఆమె... అనంతరం ఆలయం బయట మీడియాతో మాట్లాడారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా చంద్రబాబు కుప్పం చుట్టూ గిరగిరా తిరుగుతున్నారని విమర్శించారు. 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు కుప్పం అభివృద్ధి గురించి ఏనాడైనా ఆలోచించారా అని ప్రశ్నించారు. ఇటీవలి స్థానిక ఎన్నికల ఫలితాల ఆధారంగా చంద్రబాబుపై సెటైర్లు వేశారు. ఇప్పటికిప్పుడు చంద్రబాబు ఎమ్మెల్యేగా రాజీనామా చేసి పోటీ చేస్తే ప్రజలు ఎవరివైపు ఉన్నారో తేలిపోతుందన్నారు.