Minsiter Sabita: మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ లో పర్యటించిన మంత్రి సబిత| ABP Desam
మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్లలో రూ.2.34 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి. కోట్లాది రూపాయలతో డ్రెయినేజీ వ్యవస్థ, సీసీ రోడ్లతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆమె వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్గా డీపీవో లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తేగల విక్రమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.